● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎస్పీ జాతీయజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. పారదర్శకత, బాధ్యతాయుత విధానాలతో పనిచేసి ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలన్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, డీపీఓ సిబ్బందిలు పాల్గొన్నారు.


