పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వినియోగించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. పుష్కర ఘాట్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతీ ఒక్కరి బాధ్యత పేర్కొన్నారు. పరిశుభ్రతను కాపాడడంలో భక్తులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పుష్కరాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

సరస్వతి నవరత్నమాల హారతి ప్రత్యక్ష ప్రసారం

ప్రతీ రోజు కాశి పండితులతో నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారం పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రతీ రోజు రాత్రి 7.30 గంటల నుంచి దేశ, విదేశాల్లో నివసిస్తున్న భక్తులు వీక్షించడానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. రాత్రి 7.30 గంటల నుంచి నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితుల ద్వారా ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది (ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతులు) ప్రత్యేక హారతులను కాశీ పండితులు ఇస్తున్నట్లు వివరించారు.

పారిశుద్ధ్యంపై దృష్టి

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిరంతరం శుభ్రత నిర్వహణ జరుగుతోంది. నదిలో వేస్తున్న వ్యర్థాలను సైతం జల్లెడపట్టి తొలగిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్రం చేస్తున్నారు. శుభ్రత నిర్వహణలో లోపాలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మొత్తం 18 మంది ప్రత్యేక అధికారులు, సుమారు 300మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరాన్ని 5 జోన్లుగా విభజించి, ప్రతీ జోన్‌కు జోనల్‌ అధికారులను నియమించారు. జోనల్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షక సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నదీ తీర ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద భక్తులు వ్యర్థాలు వేయడానికి ప్రత్యేక ఆకర్షణగా హృదయాకారంలో ఇనుప డస్ట్‌బిన్లు ఏర్పాటు చేశారు. కంకరతో పాదాచారులకు ఇబ్బంది.. మెయిన్‌ ఘాట్‌ నుంచి వీఐపీఘాట్‌కు వెళ్లే దారిలో కంకరతో రోడ్డు నిర్మించారు. వాహనాలు భారీగా నడపడంతో కంకర తేలింది. ఈంతో ఆ దారిలో వెళ్లే పాదాచారులు నడవలేకపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement