ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చర్యలు

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

మంత్రి శ్రీధర్‌బాబు

కాళేశ్వరం: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. శుక్రవారం కాళేశ్వరంలోని మెగా విశ్రాంతి భవనంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంచేసి తక్షణ చెల్లింపులు జరిగేలా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓ పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం ఆర్డీఓ రవీందర్‌, కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తిరుమల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement