కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను సూచించారు. అధికారులతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు శుక్రవారం జిల్లాకేంద్రంలో సమీక్ష నిర్వహించారు. రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement