సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన

Nov 4 2025 7:36 AM | Updated on Nov 4 2025 7:36 AM

సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన

సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన

తగు ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: జిల్లా పరిధిలోని పలిమెల, మహాముత్తారాం మండలాల్లో ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల బృందం పర్యటించనున్నందున అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ముస్సోరి నుంచి మొత్తం 12మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు పర్యటన నిమిత్తం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. పలిమెల, మహాముత్తారం మండలాల్లో వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలన్నారు. ఆయా మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఉంటుందని, సంబంధిత శాఖలు విభాగాల వారీ గా నోట్స్‌ సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్‌ విజిట్‌ అనంతరం, పర్యటనపై ఫీడ్‌ బ్యాక్‌, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కోసం నివేదికలను తయారుచేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి..

ప్రజావాణిలో వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, సమస్యలను నేరుగా విని వెంటనే పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రతి సోమవా రం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వాణికి వచ్చిన 44మంది దరఖాస్తుదారుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement