సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాల: రైతులు పండించిన పత్తి పంటను ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకుని మద్దతు ధర రూ.8100 పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని శ్రీ బాలమురగన్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో ఎమ్మెల్యే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని చెప్పారు. రైతులు పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తెచ్చే ముందు తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులకు సీసీఐ కేంద్రంలో సరిపడా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎండీ.రఫీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, జిల్లా, మండల నాయకులు చిలుకల రాయకోంరు, దొడ్డి కిష్టయ్య, కామిడి రత్నాకర్‌రెడ్డి, గడ్డం కోంరయ్య, రవీందర్‌రెడ్డి, మన్నేం శ్రీనివాస్‌రావు, దొడ్డి కిష్టయ్య, బుర్ర లక్ష్మన్, బుర్ర శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.


