కోటగుళ్లలో కార్తీకమాసం పూజలు
గణపురం: కార్తీక మాసోత్సవాలలో భాగంగా రెండో సోమవారం కాకతీయుల కళాక్షేత్రం శ్రీభవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో స్వామి వారికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు విజయ దంపతులు, భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్, లక్ష్మీ దంపతులు పాల్గొని స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రేగొండ: బుగులోని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతూ శుభ్రతను పాటించాలన్నారు. జాతర సమయంలో రోడ్లపై నీళ్లు చల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ రాంప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి మమత, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
గెజిట్ 49, 50 షాపులకు ముగిసిన డ్రా
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యంషాపుల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా ములుగు జిల్లాలోని గెజిట్ నంబర్ 49, 50 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎకై ్సజ్ అధికారులు మరోమారు దరఖాస్తులను స్వీకరించారు. దీంతో 49వ నంబర్ చల్వాయి షాపునకు 23, గోవిందరావుపేటలోని 50వ నంబర్ షాపునకు 20 మంది దరఖాస్తులు అందాయి. సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీలోని తన చాంబర్‌లో లక్రీ డ్రా పద్ధతిన షాపులను ఎంపిక చేయగా 49వ నంబర్ షాపు సదర్‌లాల్, 50వ నంబర్ షాపు సమ్మక్క అనే మహిళకు దక్కింది. దీంతో రెండు జిల్లాల్లోని 59 షాపులకు లక్కీ డ్రా పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై వెంటనే
స్పందించాలి
ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 16మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధ పరిష్కారం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.
కోటగుళ్లలో కార్తీకమాసం పూజలు
కోటగుళ్లలో కార్తీకమాసం పూజలు
కోటగుళ్లలో కార్తీకమాసం పూజలు


