
శనిపూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయంలో నవగ్రహాల వద్ద సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా గోదావరిలో స్నానాలు చేసి నవగ్రహాల వద్ద భక్తులు అధికంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరంలో భక్తుల సందడి నెలకొంది.
సమాచారం ఇవ్వండి
భూపాలపల్లి అర్బన్: అక్రమ మెడిసిన్ అమ్మకాలు చేపట్టినట్లయితే డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడే యుద్ధంలో పౌరులే కీలకమన్నారు. పరిసరాల్లో జరిగే అనార్ధాలను గుర్తించాలని సూచించారు. మందుల చీటీలు లేకుండా అబార్షన్ కిట్లు, నిద్ర మాత్రలు అనుమానా స్పద మందులు విక్రయించినట్లయితే 180059 96969 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరా లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
కాటారం: గంజాయి సేవించడంతో పాటు జల్సాల కోసం ఇతరులకు గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం గారెపల్లికి చెందిన జాడి వివేక్, ఆకుల అఖిల్, జాడి గణేశ్, దయకి శ్రీకాంత్, సయ్యద్ అస్లాం, కాటారంకు చెందిన గంట పరిపూర్ణం గంజా యికి అలవాటుపడి స్నేహితులుగా మారా రు. ఇదే క్రమంలో మండలంలోని బయ్యారం గ్రామ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్‌లో చేస్తుండగా ఆరుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు వెంబడించి పట్టుకొని వారి వద్ద గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్‌రాజ్ అనే వ్యక్తి దగ్గర జాడి వివేక్ 950 గ్రాముల గంజాయి తీసుకొని రాగా అందులో 50 గ్రాముల వరకు గంజాయి సేవించి మిగితా గంజాయి విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆరు నిందితుల వద్ద 900 గ్రాముల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు కాగా ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు.
ఆలయాలలో
గుడి గంటల చోరీ
ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాడ రామాలయం, మాదవరావుపల్లి హనుమాన్ ఆలయంలో గంటలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాలయంలో కంచుతో తయారు చేసిన నాలుగు గంటలు, హనుమాన్ ఆలయంలో ఒక గంటను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయంపై ఆలయ పూజారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.