
జిల్లా ప్రధాన న్యాయమూర్తితో భేటీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబుతో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే శనివారం భేటీ అయ్యారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో కలిసి జిల్లాలో న్యాయ, పరిపాలన, రక్షణ పరమైన అంశాల గురించి చర్చించి న్యాయమూర్తి సూచనలు తీసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి దిలీప్‌కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, సీఐ నరేష్ కుమార్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి
రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు
రేగొండ: జిల్లాలో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయని, వాటి పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు అన్నారు. శనివారం మండలంలోని పాండవుల గుట్టలు, బుగులోని గుట్టలు, మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలను పురావస్తు శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టల్లోని సహజ రాతి ఆకృతులు, పురాతన చిత్రాలు, ప్రకృతి పచ్చదనం ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ గుట్టలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మండలకేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉప సంచాలకులు నాగరాజు, సాయి కిరణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తితో భేటీ