
క్రీడాకారులను అభినందించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డబ్ల్యూసీఎల్ కంపెనీ నాగపూర్‌లో జరిగిన కోలిండియా ఇంటర్ కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన సింగరేణి క్రీడాకారులను శనివారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్, బానోత్ రమేష్, అనుషను శాలువతో సత్కరించి అభినందించి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడంలోనే కాకుండా క్రీడలలోనూ అత్యుత్తమ ప్రతిభ చాటడం గర్వించదగిన విషయమన్నారు. సంస్థ తరఫున క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సాయం అందజేస్తున్నామని తెలిపారు. యువ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, అధికారులు, కార్మికులు గుండు రాజు, రాహుల్, శ్రీనివాస్, దేవయ్య, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు.