
విక్రయదారులు నిబంధనలు పాటించాలి
● ఎస్పీ కిరణ్‌ఖరే
భూపాలపల్లి అర్బన్: టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలని ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కూరగాయల సంతలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పరిశీలించి విక్రయదారులతో మాట్లాడారు. టపాసులు విక్రయించాలనుకునే వారు నిబంధనలు ప్రకారం సరైన లైసెన్స్ పొందాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పక్కన, పెట్రోల్ బంకుల సమీపాల్లో దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్నారు. తహసీల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్‌శాఖ సూచించిన ప్రదేశాలల్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.