
టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేందర్
కాళేశ్వరం: విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి స్పెషల్ క్లాసెస్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన వెంట ఎంఈఓ ప్రకాశ్‌బాబు, కాంప్లెక్స్ హెచ్‌ఎం బి.అన్నపూర్ణ, డీసీఈబీ సెక్రటరీ కిషన్‌రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్యామ్, శ్రీధర్, సీఆర్‌పీ సతీష్ ఉన్నారు.