
వేధించడం అప్రజాస్వామికం
ప్రజా సమస్యలపై ప్రజలను చైత్యన పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం విడ్డూరం. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. తప్పుడు కేసులు పెట్టి వేధించొద్దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
– రాచర్ల శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు