
నాపాక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల: మండలంలోని నైన్‌పాకలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం సందర్శించారు. అలయ అభివృద్ధి పనుల కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగం, టెక్నికల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఉన్నారు.
ధ్యానం దివ్య ఔషధం
● హార్ట్‌ఫుల్‌నెస్ జోనల్ కోఆర్డినేటర్ మాధవి
భూపాలపల్లి అర్బన్: ధ్యానం శరీరంలోని అనేక రుగ్మతలకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని హార్ట్‌ఫుల్‌నెస్ యోగా సంస్థ జోనల్ కోఆర్డినేటర్ చింతకింది మాధవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందుక్లబ్‌లో సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మూడు రోజుల ఉచిత యోగా, ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి యోగాసనాలు, ధ్యానం గురించి వివరించి ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు. యోగా, ధ్యానాలు ప్రతి మనిషిలోని 70వేల ఆలోచనలను సరళీకృతం చేయడమే కాకుండా వాటి ద్వారా వచ్చే అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని అన్నారు. ధ్యానం ద్వారా మనస్సు కుదుటపడుతుందని, తద్వారా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయన్నారు. ఈ యోగా సాధన 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ జిల్లా కోఆర్డినేటర్ చెరుకుపల్లి రవీందర్, నోడల్ కోఆర్డినేటర్ పొంగాని లక్ష్మణ్, వోడ్యాల శ్రీనివాస్, నరేష్, ప్రమీల, సవేరా, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

నాపాక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర