
భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సేకరణ, మ్యుటేషన్, పరిహార చెల్లింపులు, ప్రాజెక్టు పనుల పురోగతిపై శాఖల వారీగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, న్యాయంగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రాజెక్టు సంబంధిత ఫీల్డ్ స్థాయి సమస్యలను అధికారుల ద్వారా సమీక్షించి, తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.