
అమరుల సేవలు మరువలేనివి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల సేవలు మరువలేనివని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల స్తూపాన్ని గురువారం ఎస్పీ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులు స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల రక్షణకు కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, నరేష్‌కుమార్, కర్ణాకర్, మల్లేష్, ఎస్సైలు పాల్గొన్నారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు..
ఈ నెల 21వ తేదీ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో ఓపెన్‌హౌజ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాల్లో భాగంగా పోలీసుల విధులు, షీ టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల గురించి విద్యార్థులకు వివరిస్తామన్నారు. అలాగే ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండడం’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.
భూపాలపల్లి అర్బన్: కోల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. వీరు పలు పతకాలు సాధించినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్ బేగం, బానోత్ రమేష్ బంగారు పతకాలు, అనూష వెండి పతకం సాధించినట్లు వెల్లడించారు.
కాటారం: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా చేరవేసి ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ సభ్యుడిపై ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిశోర్ అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, టిపిసిసి శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధన్వాడలో నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాంధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా బండ కిషోర్, చీమల సందీప్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను పార్టీతో కలిపి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్, పలు మండలాల అధ్యక్షుడు చిటూరి మహేశ్‌గౌడ్, గడ్డం క్రాంతి, రెబల్ రాజ్‌కుమార్, మోత్కూరి అవినాష్, సాధుల శ్రీకాంత్, వినీత్, వంశీనాయక్, నగేశ్, రాజు పాల్గొన్నారు.
ములుగు రూరల్: విదేశాల్లో ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాని జిల్లా ఉపాధి కల్పన అధికారి తుల రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన వారికోసం విదేశీ నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లమా, డిగ్రీ కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు అనువైనవని వివరించారు. ఆసక్తిగల వారు tomcom, resume@ gmail. comకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అమరుల సేవలు మరువలేనివి