
క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతోపాటు క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీవైఎస్‌ఓ రఘు, క్రీడా కార్యదర్శి జయపాల్, పీడీలు రమేష్, సాంబమూర్తి పాల్గొన్నారు.
జాతర విజయవంతానికి కృషి చేయాలి
రేగొండ: బుగులు వేంకటేశ్వర స్వామి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్, విద్యుత్, వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్‌డబ్యూఎస్ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం