
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు
భూపాలపల్లి: నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్లను గుర్తించి వారి నిజ వయస్సు ఆధారంగా సవరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ