
నేటినుంచి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలను నేటి (గురువారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి లావుడియా జయపాల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో క్రీడాపోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరుకాన్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు అండర్– 14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి దేవ నవీన్ జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పేయింటింగ్ కాంపిటేషన్‌లో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. దీంతో గురు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఇండియా జాతీయ స్థాయి సంస్థ ఉత్తమ విద్యార్థి అవార్డుకు ఎంపిక చేసింది. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ కళాభారతీలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు గంగారపు మల్లేషం, ఉపాధ్యక్షుడు సుమలత చేతుల మీదుగా నవీన్‌కు అవార్డును ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాం, ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్, అధ్యాపకులు నవీన్‌ను అభినందించారు.
పలిమెల: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం పలిమెల మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు 8 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోతే కార్మికుల కుటుంబ ఎలా గడిచేదన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది శేఖర్, పెద్ది మధునయ్య, పెద్ది చంద్రయ్య, కాపుల రవి, పెద్ది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
మల్హర్: మండలంలోని తాడిచర్ల అటవీ ప్రాంతంలోని పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పో లీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేయగా పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.50,500 నగదు, 10 మొ బైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులు కొయ్యూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ కోరారు.
రేగొండ: పశు పోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధక అధికారి కుమారస్వామి తెలిపారు. బుధవారం మండల కేంద్రంతో పాటు రంగయ్యపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, పశువులకు ఒకదాని నుంచి మరొక దానికి సంక్రమిస్తుందన్నారు. నవంబర్ 14వ తేదీ వరకు టీ కా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిటి గోపాలకృష్ణ మూర్తి, పశువైద్యాధికారులు మైథిలీ, అభిషేక్, గోపాలమిత్ర, రైతులు పాల్గొన్నారు.

నేటినుంచి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీలు

నేటినుంచి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీలు