
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● డీడబ్ల్యూఓ మల్లేశ్వరి
మొగుళ్లపల్లి: బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ మల్లేశ్వరి, తహసీల్దార్ సునీత అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగరాణి, సూపర్‌వైజర్ మాధవి, సుజాత, అంగన్‌వాడీ టీచర్స్, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
మల్హర్: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ రాధిక అన్నారు. మండలంలోని మల్లారం కేజీబీవీలో బుధవారం పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో తయారు చేసిన పోషకాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషక విలువలతో కూడిన ఆహారంపై విద్యార్థులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ రక్తహీనతతో ఉండకుండా ఐరన్ ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకో వాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సద్విని యోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు భవానీ, భాగ్యలక్ష్మి, ఎన్‌జీఓ సమ్మయ్య, పోషన్ అభియాన్ స్వప్న, ఏఎన్‌ఎంస్, ఆశలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.