
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
రేగొండ: మండలంలోని బుగులోని జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాల ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పనులను అధికారులతో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో మెట్ల వెడల్పు, కోనేరు, మంచినీరు బావి నిర్మాణ పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి జాతరకు వచ్చే రోడ్లను రూ.5.5 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టనున్నామని, జాతర ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కోటంచలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఈఓ మహేష్, నాయకులు సంపత్‌రావు, రమణారెడ్డి, విజేందర్, తిరుపతి, వీరబ్రహ్మం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు