
పెద్దపులి.. పంటకు రక్ష!
కాళేశ్వరం: పెద్దపులి పంటకు రక్ష అంటే నిజంగా నమ్మలేకపోతున్నారా! అడవిలో ఉండాల్సిన పెద్దపులి పంటకు రక్షణగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా! కాదోండోయ్ పెద్దపులి బొమ్మతో రైతు తన పంటను రక్షించుకుంటున్నాడు. మహదేవపూర్ మండలం చండ్రుపల్లి గ్రామ శివారులోని పంట పొలాలను అడవి పందులు, కోతులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతు బుడే లింగయ్య కొత్తగా ఆలోచన చేశాడు. అచ్చం పెద్దపులిలాగా ఉండే ఓ పెద్దపులి బొమ్మను తన మంచె వద్ద కాపలా కాస్తున్నట్లు పెట్టాడు. ఒక్కోసారి ఒక్కో చోట ఆ బొమ్మను పెట్టి పంటను రక్షించుకోవడానికి నానాపాట్లు పడుతున్నాడు. ప్రభుత్వం అడవి పందులు, కోతుల నుంచి పంటను రక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు.

పెద్దపులి.. పంటకు రక్ష!