
ఓసీపీల్లో ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–2,3 ప్రాజెక్ట్‌లను డైరెక్టర్ మంగళవారం సందర్శించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి డైరెక్టర్ ఓపీఆర్ కాంట్రాక్టర్లు, డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లపై సమీక్షించారు. వర్షాల కారణంగా గనిలో నిల్వ ఉన్న నీటిని తక్షణమే తొలగించి ఉత్పత్తిని కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, సమర్థవంతమైన ఉత్పత్తి కొనసాగించాలన్నారు. అనంతరం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 2025–26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షించారు. ఈ ఆయా కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్‌సుందర్, మేనేజర్ రామాకాంత్, సీఎంఓ ఏఐ అధ్యక్షుడు నజీర్ పాల్గొన్నారు.