
మృతురాలి కుటుంబానికి మంత్రి పరామర్శ
కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో ఇటీవల పిడుగుపాటుతో మృతిచెందిన ఇసునం లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి లక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ సర్పంచ్ కోడి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.