పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Oct 14 2025 7:15 AM | Updated on Oct 14 2025 7:15 AM

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

రేగొండ: పోషక విలువలు గల ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు సంధ్య, సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. పోషణలోపం లేని సమాజం నిర్మించడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్వేత, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి

మల్లీశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement