
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలలో జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. రోల్‌ప్లే పోటీల్లో ప్రథమ బహుమతి మహదేవపూర్ బాలురు పాఠశాల, ద్వితీయ బహుమతి భూపాలపల్లి ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి సూరారం ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. సైన్స్ డ్రామాలో ప్రథమ బహుమతి కాటారం ఆదర్శ హైస్కూల్, ద్వితీయ బహుమతి దామెరకుంట టీజీడబ్ల్యూఆర్‌ఎస్, తృతీయ బహుమతి– మహదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో ముందుండాలని, సోషల్ మీడియా, మొబైల్ వినియోగానికి దూరంగా ఉండాలని బర్ల స్వామి తెలిపారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న, సీనియర్ ఉపాధ్యాయులు మడక మధు, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.