
‘సేవ్ పాలపిట్ట’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ముద్రించిన ‘సేవ్ పాలపిట్ట’ వాల్‌పోస్టర్‌ను గ్రీన్ వారియర్ జేవీఎస్ చంద్రశేఖర్‌తో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాలపిట్టలు రోజురోజుకూ అతరించిపోతున్నాయన్నారు. రేడియోషన్‌తో పాలపిట్టలకు ప్రాణహాని ఉందని తెలిపారు. వన్యప్రాణులు మన పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణుల ద్వారా పర్యావరణ సమతుల్యత, ప్రకృతి మూల్యాల పరిరక్షణ, దట్టమైన వర్షాలు, వాతావరణ నియంత్రణ వీటివల్ల సాధ్యం అవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా పరిగణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పర్యావరణ అధికారి పోషమల్లు పాల్గొన్నారు.