
పైరవీలు అవసరం లేదు
భూపాలపల్లి: ప్రజలు పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 12 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా దివస్‌కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే