
ఆలయాల అభివృద్ధికి కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం కోటంచలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల సహాయంతో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, పున్నం రవి, పట్టెం శంకర్, సాంబయ్య, రవీందర్ రెడ్డి, వీరబ్రహ్మం, ప్రమదాదేవి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు