
కాళేశ్వరంలో బాలకవి సమ్మేళనం
కాళేశ్వరం: తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) పురస్కరించుకొని పీఎం శ్రీ కాళేశ్వరం పాఠశాలలో ఆదివారం ‘బాలకవి సమ్మేళనం’ నిర్వహించారు. కాళేశ్వరం, మహదేవపూర్ పాఠశాల బాల బాలికలు కవితా పఠనం కార్యక్రమం పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం దొనికల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. 20 మంది బాల కవులతో పాటు 20 మంది కాళేశ్వరం పాఖాల కవులు పాల్గొని తెలుగుభాష, తెలంగాణ నుడికారం, పలుకు బడుల సోయగం, కాళోజీ ఔన్నత్యాన్ని కవితలతో అక్షరాంజలి సమర్పించారు. బాల కవులు విద్య, అక్షయ, జ్యోతిక, తన్మయి, తరుణ, సంయుక్త ఉత్తమ ప్రదర్శనతో సభను రంజింపచేశారు. హెచ్‌ఎం రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి మాడుగుల భాస్కరశర్మ మాట్లాడుతూ కవి సమ్మేళనం గొప్ప కార్యక్రమన్నారు. సాహిత్య కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరానికి చెందిన కవులు మాడుగుల భాస్కరశర్మ, నారాయణమూర్తి, శ్రీనివాస శర్మ, రామగుండం రామ్మూర్తి, ఉపాధ్యాయులు మడక మధు, జ్యోతి, శ్రీధర్, శ్యామ్, బండారి రాజ్ కుమార్‌లతో పాటు తండా హరీశ్‌గౌడ్, రహీమొద్దీన్, గన్నోజు ప్రసాద్, చిట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.