
జిల్లాకు మధ్యప్రదేశ్ మద్యం
భూపాలపల్లి: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మ ద్యం విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యక్తులు మద్యాన్ని తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. మన రాష్ట్రంలో కంటే తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో మందుబాబులు, బెల్ట్‌షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(జీరో మద్యం) విక్రయాలు జరుపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్కడి నుంచి తీసుకొని వచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. మద్యం ధరలు మధ్యప్రదేశ్‌లో కూడా దాదాపుగా ఇక్కడి మాదిరిగానే ఉన్నప్పటికీ తక్కువ ధరకు ఎలా విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి మద్యం తీసుకొని వచ్చి లేబుల్‌లు తొలగించి, కల్తీచేసిన అనంతరం తక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం భూపాలపల్లి ఎకై ్సజ్ అధికారులు ఒక వ్యక్తిని పట్టుకొని 20.25 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కాగా అప్పటికే పెద్దమొత్తంలో మద్యం దిగుమతి, విక్రయాలు జరిగినట్లుగా తెలుస్తోంది.
విచ్చలవిడిగా విక్రయాలు

జిల్లాకు మధ్యప్రదేశ్ మద్యం