
13న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు. కోర్టు ఆవరణలో గురువారం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ చేపట్టి న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడే క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాద కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జిలు నాగరాజు, దిలీప్‌కుమార్, నాయకులు శ్రావణరావు, విష్ణువర్ధన్, ఆనందరావు, రవీందర్, రాజ్‌కుమార్, ప్రియాంక పాల్గొన్నారు.