
ప్రధాన రహదారిపై రాస్తారోకో..
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం ఎదుట ఉదయం నుంచి రైతులు బారులుదీరారు. 11 గంటలు కావస్తున్నా పంపిణీ ప్రారంభించకపోవడంతో పరకాల–జమ్మికుంట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. దీంతో అరగంట సేపు వాహనాలు స్తంభించిపోయాయి.
400 బస్తాలు.. 2000 మంది రైతులు
గణపురం: మండలానికి 400 బస్తాలు రాగా సుమారు 2వేల మంది రైతులు వచ్చి యూరియా కావాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి రైతులను క్యూ లైన్‌లో నిలబెట్టి యూరియాను సరఫరా చేశారు.