
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
భూపాలపల్లి: వివిధ మండలాల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు పారదర్శకంగా, బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. జిల్లాకు బదిలీపై వచ్చిన ముగ్గురు ఏపీఎంలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణతో కలిసి ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఏపీఎంలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రేమ్‌రాజ్ రేగొండ, పద్మ భూపాలపల్లి, రాజన్నను మహదేవపూర్ మండలానికి కేటాయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల అమలుకు ఏపీఎంలు కృషి చేయాలన్నారు. శాఖాపరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానుకూలంగా సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు.
దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభ,
నైపుణ్యాలు
భూపాలపల్లి రూరల్: దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయని అవకాశం కల్పిస్తే ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన పర్పుల్ ఫెయిర్ 2025కు హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ నుంచి శిరుప అనిల్, తదితరులు పాల్గొన్నారు.
సివిల్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
చిట్యాల: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలపై నమ్మకం కలిగేలా వైద్యులు పనిచేయాలని కల్టెకర్ రాహుల్ శర్మ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమావేశం నిర్వహించారు. వైద్యులు సమయపాలన పాటించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి