
కాటారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా తిరుమల
కాటారం: కాటారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాటారం మండలకేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య సతీమణి పంతకాని తిరుమల నియమితులయ్యారు. చైర్‌పర్సన్‌తో పాటు కమిటీని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. వైస్ చైర్మన్‌గా మండలంలోని బయ్యారానికి చెందిన చినాల బ్రహ్మారెడ్డి, సభ్యులుగా పిల్లమర్రి రమేశ్, రామగుండం శ్రీనివాస్, మహేశ్ తిరుపతిరావు, ఎండీ ఈర్షాద్, ముల్కల్ల శ్రీనివాస్‌రెడ్డి, గోమాల సడ్వలి, పోత రామకృష్ణ, దాసరి సంతోష్, జాటోత్ రాజరాంనాయక్, పాగె రాజయ్య, ముక్క శ్రీనివాస్, నడిపెల్లి భారతి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడీఏ అగ్రికల్చర్, కాటారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరుమల నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలిపారు.