
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగొండ: అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక గ్రామంలోని రైతువేదికలో 79మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. బాలయ్యపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు సూరం వీరేందర్, నర్సయ్య, వీరబ్రహ్మం, తొట్ల తిరుపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు