
కలెక్టర్‌ను కలిసిన డీసీఎస్‌ఓ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్ శుక్రవారం కలెక్టర్ రాహుల్‌శర్మను కలిశారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.
రక్షణ సూత్రాలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: ఈపీ ఆపరేటర్లు, ఎంవీ డ్రైవర్లు రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి కోసం పని చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. రక్షణ నియమాలపై ఈపీ ఆపరేటర్లు, ఎంవీ డ్రైవర్లకు శుక్రవారం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరియాలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకొని వృత్తిలో అమలు చేయాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదన్నారు. పని ప్రారంభం నుంచే తప్పక రక్షణ సూత్రాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్, మారుతి, విజయ్‌కుమార్, రామన్‌పాఠక్, కార్మిక సంఘాల నాయకులు విజేందర్, మధుకర్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
క్రీడా అకాడమీలో
ప్రవేశాలకు ఎంపికలు
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్స్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాకీ, అథ్లెటిక్స్ అకాడమీ గచ్చిబౌలి, హ్యాండ్‌బాల్, పూట్‌బాల్ అకాడమీ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలబాలిలకు ఈ నెల 15, 16 తేదీల్లో అకాడమీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 12నుంచి 16సంవత్సరాల లోపు ఆసక్తిగల హాజరుకావాలని సూచించారు. విద్యార్హత, క్రీడా ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
కుటుంబ కలహాలతో
ఒకరి హత్య?
రేగొండ: కుటుంబ కలహాలతో ఒకరిని హత్య చేసిన ఘటన మండలంలోని తిరుమలగిరి శివారు పాండవులగుట్టలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పరుష రవి (45) రేగొండ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహం జరిపించారు. వీరి వైవాహిక జీవితం కొంత కాలం పాటు సజావుగా సాగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరికీ గొడవలు జరగడంతో లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి రామన్నగూడెంలో ఉంటుంది. రవి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ మహిళకు ఇంతకుముందే వివాహమై కొడుకు, కూతురు ఉన్నారు. ఆ మహిళ మొదటి భర్త కొడుకు శ్రీకర్, రవి ఇద్దరు కలిసి రేగొండ మండలంలోని పాండావుల గుట్టకు గురువారం వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరగగా రవిని శ్రీకర్ హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.
ఒకరిపై కేసు నమోదు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారిణిపై తప్పుడు ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి అధికారిణి (డీడబ్ల్యూఓ)పై అసత్యపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పట్టణానికి చెందిన మాచర్ల సంతోష్ తప్పుడు పోస్టు చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారుల పనితీరును దెబ్బతీసే విధంగా, నిరాధారమైన ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయరాదని చెప్పారు. పౌరులు వాస్తవ సమాచారాన్ని తెలుసుకొని సోషల్ మీడియా వేదికలను సరైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు.

కలెక్టర్‌ను కలిసిన డీసీఎస్‌ఓ

కలెక్టర్‌ను కలిసిన డీసీఎస్‌ఓ