
జనాభా నియంత్రణ కీలకం
భూపాలపల్లి అర్బన్: దేశ సమతుల్య అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అత్యంత కీలకమని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జనాభా పెరుగుదల వల్ల జరిగే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమలు నిర్వహించిన వైద్యులకు ఒక్క బిడ్డ కలిగిన ఐయూసీడీ వినియోగిస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు డాక్టర్ సందీప్, డాక్టర్ రోహిణి, డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
చుట్టు పరిసరాలతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ స్పెషల్ అధికారి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్‌కాలనీలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా కోఆర్డినేటర్ రాజేశ్వరి, కమ్యూనిటీ ఆర్గనైజర్ నిర్మల, ఆర్పీలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి