
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
కాటారం: వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని ఉపాధిహామీ ఏపీడీ మంజులాదేవి ఉపాధిహామీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటడం కోసం గుంతలను తవ్వించాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ వెంకన్న, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.