
దరఖాస్తుల విచారణ పూర్తిచేయాలి
కాటారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై ఆరాతీశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమందికి నోటీసులు జారీ చేశారు. ఎన్ని దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన జరిగాయనే వివరాలు తహసీల్దార్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సబ్ కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ భాస్కర్ ఉన్నారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్