28.78 | - | Sakshi
Sakshi News home page

28.78

Jul 12 2025 9:41 AM | Updated on Jul 12 2025 9:59 AM

లక్షల మొక్కలు
వారం రోజుల్లో వన మహోత్సవం ప్రారంభం

భూపాలపల్లి: అడవుల ఖిల్లాలో వన మహోత్సవానికి అంతా సిద్ధమైంది. వారం రోజుల్లో అధికారికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ప్రారంభించనుంది. ఈ ఏడాది 28.78 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం విధించుకోగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పండ్లు, పూలనిచ్చే మొక్కలతో పాటు కొత్తకొత్త రకాల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. గతేడాది నాటిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోగా ఈ ఏడాదైనా తగు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

నర్సరీల్లో నీడ, పండ్లు,

కొత్త కొత్త రకం మొక్కలు..

ఈ ఏడాది అటవీశాఖ నర్సరీల్లో కొత్తగా మొక్కల పెంపకం చేపట్టలేదు. గతేడాది ఉన్న మొక్కలే సరిపడా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కొత్త మొక్కల పెంపకం చేపట్టలేదు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 241 నర్సరీలను ఏర్పాటు చేసి నిర్ధేశిత లక్ష్యానికి తగినట్లుగా మొక్కలు పెంచుతున్నారు. ఆయా నర్సరీల్లో టేకు, ఎర్రతురాయి, మల్లె, దానిమ్మ, జామ, మునగ, మారేడు, బొప్పాయి, బాదం, చైనా బాదం, ఈత, నిద్రగన్నేరు, వెలగ, సుబాబుల్‌, సిసు, బురగా, కరివేపాకు, గులాబీ, మర్రి, మద్ది తదితర రకాల నీడ, పండ్లనిచ్చే మొక్కలను పెంచుతున్నారు.

సింగరేణిలో షో మొక్కలు

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు గనులు, గనుల ఆవరణలో నాటుతున్నారు. ఈ ఏడాది సంస్థ ఐదు లక్షల మొక్కలు నాటడం లక్ష్యం నిర్ధేశించుకోగా అందులో 85 రకాల మొక్కలు ఉన్నాయి. భారీ వృక్షాలుగా మారనున్నవి 55 రకాలు ఉండగా, 10 రకాల పండ్ల మొక్కలు, 20 రకాల షో మొక్కలు ఉన్నాయి. షో మొక్కలను సింగరేణి పార్కులు, గార్డెన్ల వద్ద బ్యూటిఫికేషన్‌ కోసం నాటనున్నారు.

బతికినవి సగమే..

జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కోట్ల మొక్కలు నాటినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అందులో సగం మొక్కలు కూడా బతకలేదని తెలుస్తోంది. రహదారులపై నాటిన మొక్కల సంక్షరణ బాధ్యతలు తీసుకోకపోవడం, జంతువులు తినడం, ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలకు నీరు అందించకపోవడంతో అవి ఎండిపోయాయి.

జిల్లా భౌగోళిక పరిస్థితి..

నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు

గతంలో నాటిన వాటిలో

బతికినవి సగమే

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో

షో మొక్కల పంపిణీ

ప్రభుత్వ శాఖ మొక్కలు నాటే

లక్ష్యం(లక్షల్లో)

డీఆర్‌డీఏ 16.74

సింగరేణి 5.00

మున్సిపల్‌ 2.49

పోలీసు 1.20

అటవీ 1.44

వ్యవసాయ 0.58

హార్టికల్చర్‌ 0.32

గిరిజన సంక్షేమం 0.40

కేటీపీపీ,

తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ 0.20

ఎకై ్సజ్‌ 0.17

ఏఎంఆర్‌ మైనింగ్‌ 0.12

ఇరిగేషన్‌ 0.12

మొత్తం 28.78

ఒక్కో మొక్కకు ఖర్చు రూ.102..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 2016లో ఏర్పడగా అప్పుడు సుమారు రెండేళ్ల పాటు ఏడాదికి కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ధేశించుకొని నాటేందుకు ప్రయత్నించారు. కోటి మొక్కల లక్ష్యం ఎక్కువ కావడం, నాటడం, పెంపకం ఇబ్బందికరంగా మారడంతో 2019 నుంచి 28 లక్షల నుంచి 30 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఈ మేరకు ప్రతీ ఏటా భారీగా పెరిగే మొక్కలతో పాటు పండ్లు, నీడనిచ్చే మొక్కలను జిల్లాలోని ఖాళీ ప్రదేశాల్లో నాటుతున్నారు. జిల్లాలో ఒక్కో మొక్క పెంపకం, నాటడం, సంరక్షణకు రూ.102 ఖర్చు వస్తుంది. అయినా పూర్తిస్థాయిలో మొక్కల సంరక్షణ చేపట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

28.781
1/1

28.78

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement