
మంత్రికి కృతజ్ఞతలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మాజీ ఎంపీపీ రాణిబాయిరామారావు శుక్రవారం ఒక ప్రకనటలో కృతజ్ఞతలు తెలిపారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడతో పాఠశాల బాలికలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిధులు మంజురు చేశారన్నారు.
అభినందన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ఏడో వతరగతి చదువుతున్న విద్యార్థి సౌజన్య ఇటీవల రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సబ్ జూనియర్ విభాగంలో విజేతగా నిలిచింది. దీంతో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు మందల రవీందర్ రెడ్డి సౌజన్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సృజన, ఉపాధ్యాయులు రమేష్, రాణి, యాకూబ్ పాషా, తిరుపతి, శ్రీనివాసరావు, షాహిద్, మల్లికార్జున, మధు, సాంబయ్య, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు
చిట్యాల: మండలంలోని పలు పాఠశాల్లో పీ ఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మండల అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాస్, సూదం సాంబమూర్తి శు క్రవారం తెలిపారు. మండలంలోని జూకల్, నై న్‌పాక, గోపాలపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొద టి రోజు విజయవంతంగా కొనసాగించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బీఎల్‌ఓలకు శిక్షణ
మల్హర్: మండలంలోని కొయ్యూరు రైతువేదిక కార్యాలయంలో బీఎల్‌ఓలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ ఎంపీఎస్‌ఓ శివకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై పూర్థిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పారదర్శక ఓటర్ జాబితాలో బీఎల్‌ఓల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఓటర్ జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అందజేత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల నాగరాజు ఇటీవల సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ లాల్‌సింగ్ సీఈఐఆర్ ఫోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించి బాధితుడికి శుక్రవారం ఎస్సై శ్రావణ్‌కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
వార్డుల వారీగా
ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శ్రీభక్తాంజనేయ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పొక్కూరి చిన్న రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీలిన గ్రామాలు, వార్డుల్లో కార్యాలయాలు అందుబాటులో లేకపోవడం వలన పలువురు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోలేక పోతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడానికి మున్సిపల్ కార్యాలయం మాత్రమే ఉందన్నారు. కార్యాలయానికి రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

మంత్రికి కృతజ్ఞతలు

మంత్రికి కృతజ్ఞతలు

మంత్రికి కృతజ్ఞతలు