
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి అర్బన్: నేడు(శుక్రవారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఇందూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని 99592 26707 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
ముఖ్య అర్చకుడిగా పదోన్నతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఆరుట్ల రామాచారికి ముఖ్య అర్చకుడిగా పదోన్నతి లభించింది. గురువారం దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో పదోన్నతి పత్రాన్ని ఈఓ మహేష్ ఆయనకు అందజేశారు. వారితో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్‌గా డాక్టర్ వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీల్లో జిల్లాకు వెంకటేశ్వర్లు బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కళాశాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు మర్యాద పూర్వకంగా కలిశారు.
విరివిగా మొక్కలు నాటాలి
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్
కాళేశ్వరం: వనమహోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖ ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటాలని కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన కాళేశ్వరాలయంలో దేవస్థానం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ముక్తివనం పార్కులో అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట మహదేవపూర్ ఎఫ్‌డీఓ సందీప్, ఎఫ్‌ఆర్‌ఓ రవికుమార్, సిబ్బంది ఆనంద్, శ్రీలత ఉన్నారు.
ఆగి ఉన్న లారీని
ఢీకొట్టిన బొగ్గు లారీ
కాటారం: కాటారం మండలం మేడిపల్లి సమీపంలో ఆగి ఉన్న బొగ్గు లారీని మరో బొగ్గు లారీ ఢీ కొట్టడంతో డ్రైవర్ తీవ్రగాయాలపాలయ్యాడు. మల్హర్ మండలం తాడిచెర్ల నుంచి భూపాలపల్లి వైపుగా వెళ్తూ బొగ్గు లారీ బ్రేక్‌డౌన్ అవడంతో రోడ్డు పక్కన నిలిచిపోయింది. తెల్లవారుజామున భూపాలపల్లి వైపుగా వెళ్తున్న మరో బొగ్గు లారీ వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఢీ కొట్టిన లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు కావడంతో డ్రైవర్ సుధాకర్ క్యాబిన్‌లో ఇరుక్కొని నుజ్జు నుజ్జు అయ్యాడు. స్థానికులు డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ట్రాన్స్‌ఫార్మర్ వైర్‌కు తగిలి లేగదూడ మృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం సబ్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో గురువారం లేగదూడ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. లేగదూడ విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుంది. ఎన్పీడీసీఎల్ అధికారులు స్పందించి తమకు పరిహారం అందించాలని బాధితుడు మేకల మహేష్ తెలిపాడు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం