
మెనూ ప్రకారం భోజనం అందించాలి
చిట్యాల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఎన్.విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలా వండి పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. వంట గదులను, కూరగాయలను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలతో భోజనం పెట్టాలని సూచించారు. అనంతరం బాలికలతో కలిసి వాలీబాల్ ఆడుతూ వారిని ఉత్తేజపరిచారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం మండలకేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ, కళాశాల ప్రిన్సిపాల్ గోల్కొండ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఉన్నారు.
అదనపు కలెక్టర్ పర్యటన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మున్సిపల్ స్పెషల్ అధికారిణి, జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నీటి వసతులు, ఎలక్ట్రిసిటీ, రోడ్డు రవాణా, శానిటేషన్ సమస్యలపై టౌన్ ప్లానింగ్ అధికారి సునిల్‌ను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అఽధికారులకు సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి

మెనూ ప్రకారం భోజనం అందించాలి