ఊరిస్తున్న మబ్బులు | - | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న మబ్బులు

Jul 10 2025 8:10 AM | Updated on Jul 10 2025 8:10 AM

ఊరిస్

ఊరిస్తున్న మబ్బులు

భూపాలపల్లి: మబ్బులు ఊరిస్తున్నాయి.. భారీ వర్షం కురుస్తుందా.. అన్నట్లుగానే పొద్దంతా మేఘాలు నల్లగా మారి వాతావరణం చల్లబడుతుంది. చివరకు చిరుజల్లులు కురిశాక వరుణ దేవుడు మొఖం చాటేస్తున్నాడు. జిల్లాలో ప్రతీరోజు ఇదే పరిస్థితి నెలకొంటుంది. వానాకాలం ప్రారంభమైనప్పటికీ చిరు జల్లులు మినహా మోస్తారు, భారీ వర్షాలు కురియలేదు. దీంతో ఈ ఏడాది వానాకాలం పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

11 మండలాల్లో లోటు వర్షపాతం..

గత నెలలో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కూడా 9వ తేదీ(బుధవారం) వరకు కూడా చిరుజల్లులు మాత్రమే కురిశాయి. జూన్‌ నెలలో జిల్లావ్యాప్తంగా సగటున 10 రోజులు మాత్రమే వర్షం కురియగా, అధిక లోటు వర్షపాతం నమోదైంది. ఒక్క రేగొండ మండలంలో మాత్రం 25 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.

పత్తికి మాత్రమే అనుకూలం..

జూన్‌ నెలలో మొదటి, నాలుగవ వారాల్లో కురిసిన మోస్తరు వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. గత నెల మొదటి వారంలో కురిసిన వర్షానికి రైతులంతా పత్తి గింజలు నాటారు. పక్షం రోజులు గడిచినా వర్షాలు కురియకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే జూన్‌ చివరి వారం, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది.

మిర్చి, వరి సాగు ఆలస్యం

సీజన్‌ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురియకపోవడంతో వరి సాగు ఆలస్యం అవుతుంది. గత నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు రైతులు వడ్లను అలికారు. ప్రస్తుతం వరిపైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా సగానికి పైగా బోర్లు లేని రైతులు ఇప్పటికీ వడ్లు అలకకుండా మరిన్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మిర్చి సాగు చేసే రైతులు సైతం మోస్తారు వర్షాలు కురిస్తేనే మిర్చి గింజలు నాటాలని భావిస్తున్నారు.

జిల్లాలో ప్రధాన పంటల సాగు అంచనా(ఎకరాల్లో)..

వరి 1,12,218

పత్తి 93,823

మిర్చి 28,000

మండలం నమోదైన సాధారణ లోటు/అదనం

వర్షపాతం వర్షపాతం శాతంలో

మహదేవపూర్‌ 67.2 175.4 –62

పలిమెల 122 183.9 –34

మహాముత్తారం 137.9 162.3 –15

కాటారం 84.2 141.2 –40

మల్హర్‌రావు 91.4 138.7 –34

చిట్యాల 108.1 147.6 –27

గణపురం 64.1 143.7 –55

భూపాలపల్లి 96.8 155.9 –38

కొత్తపల్లిగోరి 80.9 145.4 –44

టేకుమట్ల 87.2 149.8 –42

మొగుళ్లపల్లి 82.2 146.9 –44

రేగొండ 181.5 145.4 +25 అదనం

మొత్తం 100.6 152.9 –34

జిల్లాలో ప్రతీరోజు చిరుజల్లులే..

గత నెలలో లోటు వర్షపాతం నమోదు

మోస్తరు వాన కురిసింది

రెండు రోజులే..

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు

చెరువుల్లోకి చేరని వరద నీరు

మరిన్ని వానలు పడితేనే వరి సాగు..

నాకున్న ఎకరంన్నర పొలం సాగు చేసేందుకు వడ్లు అలికిన. వరినారు ఎదిగి నాటేందుకు రెడీగా ఉంది. ఇప్పుడు పడుతున్న చిన్నచిన్న వర్షానికి వరిపైరుకు ఎటువంటి ఇబ్బంది లేదు. పొలం మొత్తం తడవలేదు. ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడితేనే వరినాటు వేద్దామని అనుకుంటున్నా.

– తిప్పిరెడ్డి రవీందర్‌రెడ్డి,

అంకుశాపూర్‌, టేకుమట్ల

రిజర్వాయర్లు నీటి ప్రస్తుత

సామర్థ్యం నీటి నిల్వ(ఫీట్లలో)

గణపసముద్రం 32 14.4

భీంఘన్‌పూర్‌ 18 11

ఊరిస్తున్న మబ్బులు1
1/1

ఊరిస్తున్న మబ్బులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement