ఉద్యోగులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

Jul 10 2025 8:10 AM | Updated on Jul 10 2025 8:10 AM

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌

మల్హర్‌: ఉద్యోగులు సమయపాలన పాటించాలని లేదంటే చర్యలు తప్పవని సబ్‌కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌ అన్నారు. మండల కేంద్రం తాడిచర్ల తహసీల్దార్‌ కార్యాలయాన్ని కాటారం సబ్‌కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరు రిజిస్ట్రర్‌ను పరిశీలించారు. భూ భారతి దరఖాస్తులు, ఆన్‌లైన్‌ నమోదు వివరాలపై ఆరా తీశారు. పెండింగ్‌ భూ భారతి దరఖాస్తులను త్వరగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహసీల్దార్‌ రవికుమార్‌ను ఆదేశించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

అప్రెంటిస్‌షిప్‌ మేళా

భూపాలపల్లి అర్బన్‌: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా(పీఎంఎన్‌ఏఎం)ను ఈ నెల 14వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ జుమ్లానాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలని కోరారు. ఐటీఐ ఉత్తీర్ణులైనవారు www. apprenticeshipindia. gov. in పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూ చించారు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థల్లో అప్రెంటిస్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. భూపాలపల్లిలో జరిగే ఈ మేళాకు హైదరాబా ద్‌కు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

బాలకార్మికుడి గుర్తింపు

కాటారం: బాల కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న బాలకార్మికుడిని గురువారం అధికారులు గుర్తించారు. ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో భాగంగా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ వినోద, బాలల సంరక్షణ అధికారులు సాయిరాంగౌడ్‌, లింగారావు, పోలీసుల బృందం కలిసి గంగారంలో తనిఖీలు చేపట్టారు. రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన కేశ్‌రాం అనే వ్యక్తి 15 రోజుల కిత్రం అదే రాష్ట్రానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడిని తన వెంట తీసుకొచ్చాడు. స్థానికంగా ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా సదరు బాలుడితో గ్రానైట్‌ పనులు చేయిస్తున్నాడు. ప్రత్యక్షంగా పనుల్లో ఉన్న బాలుడిని గుర్తించిన పోలీసులు పనుల నుంచి విముక్తి కల్గించారు. అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ వినోద స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు బాలుడితో పనులు చేయిస్తున్న కేశ్‌రాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై–2 శ్రీనివాస్‌ తెలిపారు.

చేపల వేటకు వెళ్లొద్దు

ములుగు రూరల్‌: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్‌మాన్‌రాజ్‌ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం ఉత్తర్వుల నంబర్‌ 186, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ 25/11/1995 ప్రకారం జూలై, ఆగస్టు మాసాలలో చేపలు గుడ్లు పెట్టే దశను దృష్టిలో ఉంచుకుని చేపల వేట నిషేధించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో మత్స్యకారులు చెరువులు, కుంటలు, జలాశయాలకు చేపల వేటకు, ఈతకు వెళ్లకూడదని వివరించారు. చెరువులు మత్తడి పోసే సమయంలో మత్తడి వద్ద సిమెంట్‌ దిమ్మెలు, జాలీలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. అలా చేస్తే చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

గోవిందరావుపేట: జిల్లా పరిధిలోని వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని జవహర్‌నగర్‌ మోడల్‌ స్కూల్‌, గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) మహేందర్‌జీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ పాఠశాలకు 10కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌ను దాతలు వరంగల్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అంబటి శ్రీజన్‌, ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌రాజులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు కంప్యూటర్ల దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెండర్‌ అండ్‌ ఈక్వీటీ కో ఆర్డినేటర్‌ గ్యాదరి రమాదేవి, జిల్లా సైన్స్‌ అధికారి అప్పని జయదేవ్‌, మోడల్‌ స్కూల్‌ జవహర్‌నగర్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణ, చల్వా యి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యం స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement