
తరగతిలో ఉత్తమ విద్యనందించాలి
● జిల్లా విద్యాధికారి రాజేందర్
టేకుమట్ల: ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు ఉత్తమ విద్యనందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించి ఎఫ్‌ఆర్‌ఎస్, యూడైస్, ఎఫ్‌ఎల్‌ఎన్ అంశాలపై ఉపాధ్యాయలులకు పలు సలహాలు, సూచనలు అందించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయుల పనితీరు, కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగాన్ని అభినందించారు. అలాగే మండలంలోని పెద్దంపల్లిలో ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించేందుకు పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతోపాటు, సకల సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో విద్యాభోదన విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కావున ప్రతీ తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, ఎంఈఓ సుధాకర్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం కవిత, పంకజ, రంగారెడ్డి, తిరుపతి, కృష్ణారావు, అంకూస్, వింధ్యారాణి, రమాదేవి, అనురాధ, ఆనంద్ ఉన్నారు.