
ప్రజల గుండెల్లో వైఎస్సార్
గణపురం: ప్రజా సంక్షేమం కోసం ఎన్నో బృహత్తర సంక్షేమ పథకాలు ఆవిష్కరించి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నడువాలన్న ఆలోచనతో ఆరోగ్యశ్రీ,, 108, రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే
గణపురం మండలకేంద్రంలోని స్వర్ణ భారతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు