ఛత్తీస్‌గఢ్‌ టు హైదరాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ టు హైదరాబాద్‌

Jun 2 2025 1:22 AM | Updated on Jun 2 2025 1:22 AM

ఛత్తీస్‌గఢ్‌ టు హైదరాబాద్‌

ఛత్తీస్‌గఢ్‌ టు హైదరాబాద్‌

ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ నుంచి ఐరన్‌ ఓర్‌ పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలిపోతోంది. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. ఐరన్‌ ఓర్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని, పర్మిషన్‌ ఉందా లేదా అంటూ ఆరా తీశారు. అయితే డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో ఆధారాలను చూసి విచారించి వదిలేశారు. గతంలోనే మావోయిస్టులు పలు ప్రకటనల్లో ఖనిజ సంపద తరలిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. కొద్ది రోజులకే ఛత్తీస్‌గఢ్‌ నుంచి పెద్ద ఎత్తున ఐరన్‌ ఓర్‌ తరలిపోతుండడం గమనార్హం. ఖనిజ సంపదను తరలించేందుకే మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా అనే అనుమానాలను పలు ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

తరలిపోతున్న ఐరన్‌ ఓర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement