ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి
కాళేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని, నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మహదేవపూర్ మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులు చేరేలా చూడాలని చెప్పారు. బడిమానేసిన పిల్లలను బడిలో చేర్పించేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రాజిరెడ్డి, సీఎంఓ రాజేష్, ఎంఈఓలు ప్రకాశ్‌బాబు, వెంకట్‌రాజం ఉన్నారు.
జిల్లా విద్యాధికారి రాజేందర్


